
క్రైమ్ మిర్రర్ తెలంగాణ:- బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ.. ఆ పార్టీలోని కొందరు నేతలు.. ఆ లక్ష్యానికి సైంధవుల్లా అడ్డుపడుతున్నారట. నిజంగానే తెలంగాణ బీజేపీలో సైంధవులు ఉన్నారా…? ఉంటే ఎవరు వారు..? ఏం చేస్తున్నారు..? తెలంగాణలో పార్టీ ఎదుగుదలకే అడ్డుపడుతున్న ఆ నాయకులు ఎవరు?.. గతంలో కంటే తెలంగాణలో బీజేపీ పుంజుకున్న మాట వాస్తవం. అయితే… ఈ ఎగుదల ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని చెప్పక తప్పుదు. ఎందుకంటే.. పార్టీలో అంతర్గత కలహాలు, నాయకుల మధ్య అభద్రతా భావం… పార్టీ ఫ్యూచర్‌కు గండి కొడుగుతోంది. తెలంగాణ బీజేపీలో చేరేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నా… పార్టీలోకి కొందరు నేతల అభద్రతా భావం వారిని రానివ్వకుండా చూస్తోంది. దీంతో… కొత్త నేతలు పార్టీలో చేరలేకపోతున్నారు. దీంతో… తెలంగాణ బీజేపీ బలపడలేకపోతోంది. పైగా… పార్టీలోని ఉన్న నేతల మధ్య గొడవలు.. పార్టీ ప్రతిష్టను పడిపోయేలా చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. ఎన్ని ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని బీజేపీ ఛేదించడం కష్టమనే చెప్పాలి.
Read also : ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాలేదా?.. హౌసింగ్ కార్పొరేషన్ కీలక సూచన!
బలమైన నాయకులను ఆహ్వానించినప్పుడే… ఏ పార్టీ అయినా బలపడేది. కానీ.. బీజేపీలో అలా జరగడం లేదు. పక్క పార్టీ నేతలు… బీజేపీలో చేరేందుకు వస్తున్నా… పార్టీలో ఉన్న నేతలు అడ్డుకుంటున్నారట. ఆ నియోజకవర్గంలో మేం ఉండగా.. కొత్త నాయకులు ఎందుకని ప్రశ్నిస్తున్నారట. అంతేకాదు బీజేపీలోని పాత నేతలు.. కొత్త నాయకులను ఎదగనివ్వరన్న టాక్ కూడా ఉంది. దీంతో.. బీజేపీలో చేరికలకు ఫుల్‌స్టాప్ పడింది. అంటే.. పార్టీ బలోపేతానికి బ్రేక్ పడిందన్న మాట. ఇందుకు కారణం.. కమలం పార్టీలోని సైంధవులే అన్న చర్చ జరుగుతోంది. బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. కొత్త వారు పార్టీలోకి వస్తామంటే… ఆహ్వానిస్తామే గానీ… ఎందుకు అడ్డుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. వారు అంత పాజిటివ్‌గా ఉంటే… మరి కొత్తవారి చేరికలను అడ్డుకునేది ఎవరు…? అంటే… న్యూ వర్సెస్ వెరీ న్యూ. ఇదే తెలంగాణ బీజేపీలో ఉన్న సమస్య అంటున్నాయి పార్టీ వర్గాలు. కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన వారే… కొత్త నాయకుల జాయినింగ్‌కు అడ్డుపడుతున్నారని సమాచారం. ఇటీవల గువ్వల బాలరాజు… బీజేపీ కండువా అయితే కప్పుకున్నారు. అయితే.. ఆయన చేరికపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ అసంతృప్తిగా ఉన్నట్టు టాక్. మరి.. కమలం పెద్దలు ఈ ఇష్యూపై దృష్టిపెడతారా…? పార్టీలోని సైంధవులకు చెక్ పెడతారా..? అనేది చూడాలి.
Read also : చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు.. వైఎస్ జగన్ శాపనార్ధాలు