అంతర్జాతీయం

నెలలో 6 వేల డ్రోన్ దాడులు.. ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నరష్యా!

Russia Drone Attacks: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి.  జూలై నెలలో ఏకంగా 6 వేలకు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2022లో యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఒక నెలలో ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్‌ దాడులు చేయడం ఇదే తొలిసారి అని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్ లో పదుల సంఖ్యలో ప్రజలు చనపోగా, పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించాయి.

జూలైలో 6,297 డ్రోన్ దాడులు

జూలైలో రష్యా డ్రోన్ దాడులకు సంబంధించి ఉక్రెయిన్ వైమానిక దళం కీలక వివరాలు వెల్లడించింది. మాస్కో సేనలు గత నెలలో 6,297  లాంగ్ రేంజ్ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపింది. జూన్‌ తో పోలిస్తే దాదాపు 16 శాతం ఎక్కువ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గత ఏడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో 14 రెట్లు ఎక్కువ డ్రోన్లు ప్రయోగించినట్లు ప్రకటించింది.  ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని, వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.

ఒకేరాత్రి 728 డ్రోన్ దాడులు

జూలై 9న ఒక్క రాత్రిలోనే రష్యన్‌ సైన్యం ఏకంగా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌ లోని సుమీ,  ఖేర్సన్ సహా పలు రీజియన్లలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇవ్వాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన మరుసటి రోజే ఈ భీకర దాడులు కొనసాగాయి. జులై 31న కీవ్‌పై జరిపిన దాడిలో ఐదుగురు చిన్నారులు సహా 31 మంది మృతి చెందగా, మరో 159 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ వెల్లడించింది.

Read Also: ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్ల కొనుగోలుకు బ్రేక్.. భారత్ కీలక నిర్ణయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button