
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం లాంటివి చేస్తూ ఉన్నారు. ఈ వ్యాయామంలో భాగంగానే కొంతమంది రన్నింగ్ చేస్తుండగా మరికొందరు మాత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటిలో ఏది శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి డౌట్ గా ఉంటుంది. అయితే తాజాగా వైద్యులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే వాకింగ్ కంటే రన్నింగ్ శరీరానికి ఎక్కువ మేలు చేస్తుంది అన్నారు. సాధారణ నడకతో పోలిస్తే పరుగు తీయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ జీవక్రియ ప్రయోజనాలను అందిస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి హెల్తీగా ఉన్నవారు కచ్చితంగా వారానికి ఐదు రోజులు 45 నిమిషాల పాటు పరిగెత్తితే గుండు సామర్థ్యం మరియు మెదడు పనితీరు బాగా మెరుగవుతుంది అని అంటున్నారు.
ఈరోజు అర్ధరాత్రి నుంచి NETFLIX లో స్ట్రీమింగ్ కానున్న “బాహుబలి ది ఎపిక్”
అయితే మరోవైపు చాలామంది మాట్లాడుతూ పరిగెత్తడం వల్ల కీళ్లు దెబ్బతింటాయి అని అంటూ ఉంటారు. కానీ అవన్నీ అపోహ మాత్రమే అని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. కనీసం వారానికి ఐదు రోజుల పాటు అయినా హెల్తీ గా ఉన్నవారు 45 నిమిషాల పాటు పరిగెత్తవచ్చు అని తెలిపారు. అయితే ఇప్పుడిప్పుడే వ్యాయామం ప్రారంభించిన వారు జస్ట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది అని అంటున్నారు. కాబట్టి వైద్యులు చెబుతున్న దాని ప్రకారం ప్రారంభ దశలో ఉన్న వారికి నడక, శారీరక సామర్థ్యం ఉన్నవారు రన్నింగ్ చేయడం అనేది ఉత్తమంగా భావిస్తున్నారు. కాబట్టి మీరు కూడా డాక్టర్లు సూచనలు మేరకు నడుచుకోవాలని కోరారు. లేదంటే సడన్ హార్ట్ ఎటాక్స్, ఒత్తిడి వంటివి వచ్చే ప్రమాదం ఉంది.
Read also : పర్సనాలిటీ రైట్స్ పొందిన తొలి భారత క్రీడాకారుడు?





