
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- భారతదేశ మాజీ ఉప ప్రధాని,స్వాతంత్ర సమరయోధుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి వేడుకలు మునుగోడులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్సై ఇరుగు రవి కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఇరుగు రవి కుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయటంలో పటేల్ కీలకపాత్ర పోషించారు అని అన్నారు. అందుకే ఆయనను ఉక్కుమనిషిగా పిలుస్తారని గుర్తుకు తెచ్చారు. ప్రతి ఒక్క యువత దేశం కోసం తమ సమయాన్ని కేటాయించాలనీ, దేశ ఐక్యత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, యువత విద్యార్థులు, మండల ప్రజలు పాల్గొన్నారు.
Read also : ఆరంభంలోనే బోల్తా పడినా ఇండియా..!
Read also : ఖమ్మం సీపీఎం సీనియర్ నేత దారుణ హత్య…
Read also : జగన్ గ్రాఫ్ ను ఆకాశానికి ఎత్తేయాలనుకున్నారు.. కానీ చివరికి?
 
				 
					
 
						 
						




