
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన తుఫాన్ పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ అయినటువంటి తిరుమలరావు కీలక ఆదేశాలు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అవసరం లేనటువంటి రోడ్లలో బస్సు సర్వీసులను తాత్కాలికంగా ఈ రెండు రోజులపాటు నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ప్రజలను దృష్టిలో ఉంచుకొని.. ఎక్కువగా రద్దీ ఉండే మార్గాల్లోనే బస్సు సర్వీసులను నడపాలని సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున రాత్రి పూట ఎక్కడా కూడా ఒకచోట నిలవకూడదు అని.. అలాగే ముంపునకు అవకాశం ఉన్నటువంటి కాలువలు, చెరువు కట్టలు వద్ద బస్సులు నడపవద్దు అని కీలక ఆదేశాలు చేశారు. దూర ప్రాంత సర్వీసులను ప్రజల రద్దీని బట్టే నడపాలి అని సూచించారు. కాగా కాకినాడలో తుఫాన్ కారణంగా వర్ష బీభత్సం సృష్టిస్తుండడంతో అక్కడ చాలా అంటే చాలా తక్కువ బస్సులను అందుబాటులో ఉంచారు. కాగా వాతావరణ శాఖ అధికారులు ఆదేశించిన ఆదేశాల మేరకు ఈ రెండు రోజులపాటు బస్సు డ్రైవర్లు కూడా చాలా నిదానంగా బస్సును నడపడమే కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి అని కోరారు. ఎవరైనా సరే బస్సు డ్రైవర్లు రూల్స్ ను అతిక్రమించి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.
Read also : నేడే తుఫాన్ ఎఫెక్ట్.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకండి!
Read also : సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలి : సిఐ ఆదిరెడ్డి





