క్రైమ్ మిర్రర్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. 17 వేల కోట్ల పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. మీ కృషి, మీ సహకారం, మీ సలహాతోనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందని కోమటిరెడ్డికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు కోమటిరెడ్డి అనితరసాధ్యమైన సహకారంతో సంవత్సరంలో సాధ్యమైందని ప్రశంసించారు. RRR ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు మరో మణిహరంగా రీజనల్ రింగ్ రోడ్డుకు దాదాపు ఏడేళ్ల క్రితం అడుగు పడింది. 2017లోనే రెండు భాగాలుగా నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
Also Read : సీఎం రేవంత్‌కు బండి సంజయ్ డెడ్ లైన్.. ఆ తర్వాత దంచుడే!
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలుగా ప్లాన్ చేశారు. అయితే కేంద్రం నుంచి కదలిక లేకపోవడంతో ఏడేళ్లుగా ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. 2019లో భువనగిరి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్జి రీజనల్ రింగ్ రోడ్డు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు సార్లు కలిసి ఆర్ఆర్ఆర్ కోసం విన్నవించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రోడ్డు, భవనాల శాఖ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దక్కింది. దీంతో రీజనల్ రింగ్ రోడ్డు కోసం మరింతగా శ్రమించారు. మంత్రి కాగానే ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని మరోసారి కలిసి ప్రాజెక్టుకు అనుమతుల కోసం ప్రయత్నించారు. కోమటిరెడ్డి ప్రయత్నాలు ఫలించి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. మొత్తం 17 వేల కోట్ల బడ్జెట్ తో 196 కిలోమీటర్లు ఉత్తర రోడ్డును నిర్మించనుంది. మొదట నాలుగు లైన్ల రోడ్డు నిర్మిస్తారు. భవిష్యత్తులో 8 లైన్లకు విస్తరిస్తారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం టెండర్లు పిలవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!
- ఎమ్మెల్సీగా నెల్లికంటి సత్యం! సీపీఐకి ఒక సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీ
- రైతు భరోసా ఇప్పట్లో లేనట్లే! మళ్లీ ఆన్ లైన్ అప్లికేషన్స్ అట..
- ప్రీమియర్ షోస్ కోసం CM ను అడుక్కోవడం కరెక్ట్ కాదు: నిర్మాత
- హైడ్రా కూల్చివేతలు ఆగవు.. పెద్ద భవనాలనైనా కూల్చేస్తాం!!