
Romance: శృంగారం అనేది కేవలం శారీరక అవసరం మాత్రమే కాదు.. మన మానసిక, భావోద్వేగ, శారీరక ఆరోగ్యాన్ని సమతుల్యం చేసే సహజమైన ప్రక్రియ. దాంపత్యంలో సాన్నిహిత్యం పెరిగి, ఇద్దరి మధ్య నమ్మకం, ప్రేమ, అర్ధం చేసుకునే తత్వం మరింత బలోపేతం అవుతుంది. శృంగారం రెగ్యులర్‌గా జరగడం వల్ల బరువు నియంత్రణ, ఒత్తిడి తగ్గింపు, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గించడం వంటి అనేక లాభాలు లభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఒక దశాబ్దం క్రితం అమెరికాలో ప్రజలు ఎక్కువ శృంగారం చేసేవారని, కానీ 2010 తర్వాత అది గణనీయంగా తగ్గిపోయిందని అధ్యయనాలు వెల్లడించాయి. దానికి పని ఒత్తిడి, బిజీలైఫ్, ఇంటర్నెట్ వినియోగం వంటి అంశాలు ప్రధాన కారణాలు. అయినా, శృంగారం ఎన్నిసార్లు చేస్తారన్నది ముఖ్యం కాదు.. ఇద్దరూ సంతృప్తిగా, ఆనందంగా ఉన్నారా అన్నదే అసలు విషయం అని నిపుణులు చెబుతున్నారు.
వారానికి ఒక్కసారి జరిగినప్పటికీ దాంపత్య సంతోషం తగ్గదని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ శృంగారంలో పాల్గొనే పురుషులకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయన ఫలితాలు చెప్పాయి. శృంగారం సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. శరీరంలో నొప్పిని తగ్గిస్తుంది.
నియమిత శృంగారం రోగనిరోధక శక్తిని పెంచే IgA అనే యాంటీమండీ స్థాయిలను పెంచి, జలుబు, ఫ్లూ వంటి రోగాల నుండి రక్షణను అందిస్తుంది. అలాగే శృంగారం వల్ల గుండె స్పందనలు వేగంగా పనిచేసి శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది టాక్సిన్స్ బయటకు వెళ్లడంలో సహకరించి శరీరాన్ని తేలికగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
క్లైమాక్స్ సమయంలో విడుదలయ్యే డైహైడ్రోపియాండ్రోస్టెరాన్ అనే హార్మోన్ కణజాల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం తాజాగా కనిపించడంలో, శరీర శక్తి పెరగడంలో ఇది సహాయపడుతుంది. నిజానికి శృంగారం అనేది దాంపత్య జీవితానికి మాత్రమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యానికి కూడా ఒక సహజ థెరపీ అని చెప్పాలి.
ALSO READ: Royal Enfield: ఓర్నీ.. 1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర ఇంత తక్కువా?





