
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ రాజకీయ నేత పుట్టినరోజు అయితే ఇరు నేతలు కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కానీ మరుసటి రోజు వెంటనే బద్ధ శత్రువులుగా మారిపోతారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే ప్రతిరోజు తారుమారు అవుతూ ఉంటాయి. అధికారం మరియు ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఇక తాజాగా వైసీపీ నేత రోజా.. పవన్ కళ్యాణ్ పార్టీని అలాగే ఆ పార్టీని అభిమానించే కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన జండా మోసే ప్రతి ఒక్కరూ కూడా సిగ్గులేని వారు అని అన్నారు. వాళ్లు జనసేన జెండా తప్ప మిగతా అన్ని పార్టీల జెండాలు మోస్తారు అని ఎద్దేవా చేశారు.
Read also : మేడారం జాతర పనులు ఈనెల 20 లోపు పూర్తవుతాయి : మంత్రి పొంగులేటి
అసలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి ఉపయోగమంటూ.. ఆయన ప్యాకేజీలు తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరారు అని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన అభిమానులు తీవ్రస్థాయిలో రోజాపై విరుచుకుపడుతున్నారు. జనసేన నాయకులు అంటే సహాయం చేసే వారి తప్ప ఇతరుల కడుపు కొట్టేవారు కారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ తరపున సాధ్యం కాకపోతే తన సొంత డబ్బులను ప్రజలకు సహాయం చేస్తారు అని.. అతని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు అని రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి నీచంగా మాట్లాడడం మీ పార్టీకే సాధ్యమంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా గత వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పై రోజా తీవ్రస్థాయిలో విమర్శిస్తూనే వస్తున్నారు.
Read also : ఉదయం లేచాక ఈ లక్షణాలు కనిపిస్తే మీరు డేంజర్‌లో ఉన్నట్లే!





