Monday, February 23, 2026
Homeజాతీయంపవన్ కళ్యాణ్ పై రైమింగ్ టైపులో ఘాటుగా విమర్శలు చేసిన రోజా

పవన్ కళ్యాణ్ పై రైమింగ్ టైపులో ఘాటుగా విమర్శలు చేసిన రోజా

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయపరంగా ఎన్నో గొడవలు మనం ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. అయితే వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మాత్రం 2019 నుండి ప్రత్యర్థులపై ఏదో ఒక విమర్శలు చేస్తూనే ఉంటుంది. 2019లో ఎమ్మెల్యే పదవిలో ఉన్న రోజా టిడిపి, జనసేన, నాయకులను అధికారులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై  వ్యక్తిగతంగాా ఘాటుగా విమర్శలను చేస్తూ వచ్చింది.

అయితే 2024లో ఆర్కే రోజా నీ ఘోరంగా ఓడించారు నగరి నియోజకవర్గ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను కూడా ఏమాత్రం లెక్కచేయకుండా  విమర్శలు చేయడంపై అసలు వెనక్కు తగ్గట్లేదు. ఇప్పుడు కూడా ప్రతిరోజు ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూనే ఉంది. అలాగనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై రైమింగ్ టైపులో భారీ సినిమా టైపులో విమర్శలు చేసింది. ఈమధ్య పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లను శుభ్రం చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు. అలాగే తిరుపతి లడ్డు అపవిత్రంపై పోరాటాలు కూడా చేశాడు. అలాగే సనాతన ధర్మం పై కూడా అందరూ హిందువులు ఏకం కావాలని సూచనలు చేశాడు. వీటిపై ఇప్పుడు రోజా స్పందించింది.

Read More : కొండా సురేఖ పై… తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రభాస్, రామ్ చరణ్

నువ్వు పంచ ఎగ కట్టాల్సింది అమ్మవారి గుడిమెట్ల పై కాదు విజయవాడ వరద బాధితుల కోసం, అలాగే మీరు ధర్మం ధర్మం అని అరవాల్సింది నడిరోడ్డుపై కాదు వైజాగ్ స్టీల్ కార్మికుల కోసం, మీరు గొడవ పడాల్సింది మతాల కోసం కాదు వరద బాధితులలో సాయం అందని వారి కోసం అని రైమింగ్ టైపులో అనుకుంటూ ఘాటుగా విమర్శలు చేసింది. మీకు నిజంగానే దేవుడు బుద్ధి మరియు జ్ఞానం ఇచ్చుంటే దాన్ని కాస్త ఉపయోగించుకోండి అంటూ రోజా ఘాటుగా విమర్శలు చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికె రోజా పై తెగ ఫైర్ అవుతున్నారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ గురించి తప్ప మనిషి గురించి ఎప్పుడు మాట్లాడావని అలాగే ప్రతిరోజు కూడా ఎవరో ఒకరి మీద అరవడం తప్ప ప్రజలకు ఏమైనా సాయం చేసేవాఅని కామెంట్ల రూపంలో ఫైర్ అవుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments