
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా నేడు జరుగుతున్న మూడవ వన్డేలో సూపర్ సెంచరీ చేశారు. 105 బంతుల్లో 100 పరుగులు నమోదు చేసి రికార్డు సృష్టించారు. రెండు సిక్స్ లు , 11 ఫోర్ లతో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్ శర్మకు ఎంత కీలకమో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ నేడు జరిగిన ఈ వన్డే మ్యాచ్లో చాలా అద్భుత ప్రదర్శన కనబరిచారు. విరాట్ కోహ్లీ మొదటి రెండు వన్డే మ్యాచ్లలో డక్ అవుట్ అయ్యి వెను తిరగగా నేడు జరిగిన ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ తో రాణించారు. ప్రతి ఒక్కరూ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడితే చూడాలి అన్న కళ నేడు నెరవేరింది అని చెప్పాలి. 2027 వర్డ్ ఈ వరల్డ్ కప్పులో వీరిద్దరూ ఆడాలంటే ఈ ఆస్ట్రేలియా సిరీస్ చాలా కీలకమని ముందు నుంచి చెబుతూనే ఉన్నాం. అనుకున్నట్లుగానే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఈ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చారు అని చెప్పాలి. నేడు జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్ లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది.
Read also : అప్పుల్లో మొదటి రెండు స్థానాలను సంపాదించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు?
Read also : తెలంగాణకు పొంచి ఉన్న వర్షపు ముప్పు.. ఎన్ని రోజులు అంటే?





