
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- 2027 వన్డే వరల్డ్ కప్ కు తిరిగి మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టాలి అని మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీమిండియా టెస్ట్ మరియు వన్డే కెప్టెన్గా ఫెయిల్ అవుతుండడంతో మనోజ్ తివారి ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా గిల్ నాయకత్వంలో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ తో జరిగినటువంటి సిరీస్ లను భారత్ కోల్పోవడంతో అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలి అని డిమాండ్ చేశారు. వన్డే వరల్డ్ కప్ కు మరొక ఏడాది మాత్రమే సమయం ఉండగా ఇప్పటినుంచి వాటిపై ఇండియా అభిమానులు అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ తరుణంలో టీమిండియా పర్ఫామెన్స్ అంతంత మాత్రం గానే ఉంటే కచ్చితంగా ఫ్యాన్స్ అందరు కూడా ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ మనోజ్ తివారి ప్రస్తుత కెప్టెన్ గిల్ స్థానంలో వన్డే వరల్డ్ కప్ కోసం మళ్లీ రోహిత్ శర్మ కే పగ్గాలు అప్పగించాలి అని బీసీసీఐకి సూచించారు. రోహిత్ శర్మ ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి అని.. అతను ఉన్నంతకాలం వన్డే కెప్టెన్ గా ఉంచాలి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా మూడు ఫార్మేట్ లలో రాణించే గిల్ ఒకవైపు బ్యాటింగ్ పరంగాను మరోవైపు కెప్టెన్సీ పరంగా ను ఫెయిల్ అవుతూ వస్తున్నారు.
Read also : విచారణ పేరుతో డ్రామాలు చేస్తున్నారు : కేటీఆర్
Read also : చద్దన్నం తింటే ఏమవుతుందో తెలుసా?





