
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టీమిండియా స్టార్ క్రికెటర్ అయినటువంటి రోహిత్ శర్మ హిట్ మ్యాన్ గా గుర్తింపు పొందిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. హిట్ మాన్ అనే బిరుదు చాలా సింపుల్గా అయితే రాలేదు. దాని వెనుక ఎంతో కష్టం అలాగే పట్టుదల దాగి ఉంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయస్సు 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల వయసులో కూడా రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి అనేక మ్యాచ్లలో విజయాన్ని సాధించి పెట్టినా రోహిత్ శర్మ.. నేడు మూడు పదుల వయసులోనూ రికార్డులు సాధిస్తున్నారు.
Read also : అసలైన అవినీతి యువరాజులు వీరే : ప్రధాని మోదీ
తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి రోహిత్ శర్మ ఎగబాకారు. 781 పాయింట్లతో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ 764 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఆ తరువాత రెండు స్థానాలు పడిపోయి 745 పాయింట్లతో మూడవ స్థానంలో ప్రస్తుత యువ క్రికెటర్, భారత జట్టు టీ-20 మరియు టెస్ట్ కెప్టెన్ అయినటువంటి గిల్ నిలిచారు. కాగా ఈ వయసులోనూ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉండడం పట్ల ఒకవైపు భారత జట్టు అభిమానులు మరో వైపు రోహిత్ శర్మ అభిమానులు చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పటికీ సోషల్ మీడియా వేదిక అంతటా కూడా రోహిత్ శర్మకు కంగ్రాట్స్ చెబుతూ పండగ చేసుకుంటున్నారు. కాగా రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీని మరోసారి మనం సౌత్ ఆఫ్రికా తో జరగబోయేటువంటి వన్డే మ్యాచ్లలో చూసే అవకాశం ఉంది. ఇప్పటికే 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడాలి అని ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం.
Read also : ఆహా పట్టుదల అంటే ఇది.. మొదటి మ్యాచ్ లో ఘోర ఓటమి.. కట్ చేస్తే ఫైనల్ కు?





