
-
మర్రిగూడ మండల కేంద్రంలో అస్తవ్యస్తంగా రహదారి..!
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. రోడ్లు ఇరుకుగా మారడంతో వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారు. మర్రిగూడ నుండి నాంపల్లి మండల కేంద్రానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో, నిత్యం వందలాది వాహనాలు ఈ దారి గుండా ప్రయాణిస్తుంటాయి. అయితే పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా, రహదారి విస్తరణ జరగకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
నిత్యం ట్రాఫిక్ జామ్‌లు మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద, రోడ్డు మరీ ఇరుకుగా ఉండటం వల్ల ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే చాలు, ట్రాఫిక్ నిలిచిపోతోంది. ముఖ్యంగా స్కూలు బస్సులు, వ్యవసాయ పనులకు వెళ్లే ట్రాక్టర్లు వచ్చినప్పుడు, చాలా సేపు వాహనాలు రోడ్లపై నిలిచిపోతున్నాయి. మండల కేంద్రం దాటే వరకు కూడా, ఇరుకైన మలుపుల వల్ల తరచూ, చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలని, స్థానిక వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే మర్రిగూడ టూ నాంపల్లి ప్రధాన రహదారిని, యుద్ధప్రతిపాదికన విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
READ ALSO
-
Abhishek Sharma: కొత్త గెటప్‌లో కనిపించిన భారత స్టార్ ఓపెనర్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్
-
మాడుగులపల్లిలో దారుణం: భర్తను చంపినా భార్య..!





