– బొలెరో వాహనం ఢీ కొట్టిన కారు
– పలువురికి గాయాలు, ప్రధాన ఆసుపత్రికి తరలింపు
క్రైమ్ మిర్రర్, భూపాలపల్లి : జయశంకర్ జిల్లాలో ఆదివారం (శనివారం అర్ధరాత్రి దాటాక..) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం భూపాలపల్లి కాలేశ్వరం జాతీయ రహదారిపై ప్రయణిస్తున్న బొలెరో వాహనంను అతివేగంగా ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు ఈ ప్రమాదాన్ని చూసి అంబులెన్స్ కు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు, ప్రమాదంలో గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.