
క్రైమ్ మిర్రర్, చౌటుప్పల్:–
యాదాద్రి భువనగిరి జిల్లా,చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోనాల పండుగ సందర్భంగా హాలియా నుంచి బయలుదేరిన 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రయాణికులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బోనాల పండుగ కోసం బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి సమీపంలో ఇది చోటుచేసుకున్నది.తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులకు స్వల్ప గాయాలు జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.బోనాల పండుగ సన్నాహాల్లో ఉన్న తరుణంలో ఈ ప్రమాదం అందరిని కలచివేసింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే అవసరాన్ని ఈ ఘటన మరల గుర్తు చేసింది
Read also : రావిర్యాలలో గ్రామ చిరు వ్యాపారుల సంఘం ఏర్పాటు.. అధ్యక్షులుగా లక్ష్మీనారాయణ!
Read also : ముంబైలో దారుణం.. మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం!