
క్రైమ్ మిర్రర్, తెలంగాణ న్యూస్:- బంగారం అంటే దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టం. ఇది నా ఫంక్షన్ కి వెళ్లాలన్నా లేదా పెళ్లికి వెళ్లాలన్నా కచ్చితంగా బంగారం లేనిదే ఆడవారు బయటకి అడుగు పెట్టరు. అలాంటి బంగారం.. నేడు మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేయాలంటే చాలానే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాల జీతాలు అంతంత మాత్రమే. కానీ బంగారం ధరలు మాత్రం ప్రతిరోజు కూడా ఆకాశానికి తాగుతున్నాయి.
మందు బాబులకు బ్యాడ్ న్యూస్, రెండు రోజులు వైన్స్ బంద్!
నేడు తెలంగాణ రాష్ట్రంలో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాదు లాంటి ముఖ్య నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 600 రూపాయలు పెరిగి 99 వేల రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 550 రూపాయలు పెరిగి 90,750 రూపాయలు పలుకుతుంది. దీంతో సామాన్య ప్రజలు బంగారం ని కొనుగోలు చేయాలంటేనే విలవిలలాడిపోతున్నారు. సంవత్సరం మొత్తం కూడా కష్టపడినా డబ్బులు మొత్తం బంగారానికి పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇక మరోవైపు కేజీ వెండి ధర ₹1000 పెరిగి 1,21,000గా ఉంది. దీంతో ధనవంతులు తప్ప మిగతా మధ్యతరగతి మరియు పేదరికంలోని ప్రజలు మాత్రం బంగారం వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. మనసులో కొనుగోలు చేయాలని ఉన్నా కూడా… మనసులోని దాచుకొని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు అన్ని నగరాలలో ఇవే ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ బంగారం ధరలు రోజురోజుకీ పెరగడమే తప్ప తగ్గేది లేదని… బంగారం వైపు చూడడమే మానేస్తున్నారు.