
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య 4 వ టెస్ట్ మ్యాచ్ నిన్న మధ్యాహ్నం ప్రారంభమైంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్… బౌలింగ్లో అంతగా రాణించలేకపోయింది. ఇక మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా ఓపినర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైష్ వాళ్ళిద్దరూ కూడా చాలా చక్కగా రానిచ్చారు. ఇక ఇండియా మొదటి రోజు బ్యాటింగ్ చేస్తూ నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఇక మొదటిరోజు ఆటలో భాగంగా కెప్టెన్ గిల్ విఫలమవ్వగా… రిషబ్ పంత్ కు పెద్ద గాయమే అయింది. దీంతో టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుండి బాగా రాణిస్తున్న ఓపినర్లు ఇద్దరు కూడా అవుట్ అయ్యి తరువాత వచ్చిన గిల్ వెంటనే అవుట్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ షాకు కు గురయ్యారు. ఆ తర్వాత వచ్చిన పంత్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరు కూడా బాగా ఆడుతున్నారు అని అనుకోగా.. పంత్ కాలికి గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ కావాల్సి వచ్చింది.
ఇక ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి రోజు టీమిండియా టాప్ ఆర్డర్ మంచిగా ప్రారంభించిన.. ఇవాళ మాత్రం ఆల్రౌండర్ల పైనే ఆశలు పెట్టుకుంది. యశస్వి జైస్వాల్ (58) రాహుల్ (46), సాయి సుదర్శన్(61) రాణించడంతో నాలుగు వికెట్లు కోల్పోయిన ఇండియా 264 పరుగులు చేసింది. నేడు జడేజా మరియు శార్దుల్ ఠాకూర్ గ్రీజ్ లో ఉన్నారు. కాబట్టి షార్ట్ ఠాకూర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ … ఈ ముగ్గురు ఆల్రౌండర్ల మీదే నేడు స్కోర్ ఎంత చేస్తారనేది ఆధారపడి ఉంది. ఈ ముగ్గురు ఆల్రౌండర్లు నిలిస్తేనే టీమ్ ఇండియా జట్టు స్కోరు 400 దాటేటువంటి అవకాశం ఉంది. మరి టీమిండియా ఈరోజు 400 పరుగులను సాధిస్తుందా లేదా అనేది కామెంట్ల రూపము ద్వారా తెలియజేయండి.
ప్రముఖ యాంకర్ సుమ భర్తకు షాక్… నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసుల నోటీసులు