
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- విజయ్ హజారే ట్రోఫీలో ఆయా జట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండగా మరికొన్ని జట్లు మాత్రం పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి విజయ్ హజారే ట్రోఫీకి మరింత ఆదరణ పెరిగింది. దానికి కారణం దిగ్గజ క్రికెట్ ప్లేయర్లు ఇందులో మళ్లీ ఆడడం.. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నటువంటి క్రికెటర్లు అందరూ కూడా ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఏ విధంగా ఆడతారో అనే ఉత్కంఠతో ప్రతి ఒక్కరు కూడా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లను వీక్షిస్తున్నారు.
Read also : జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్
ఇక తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగానే ఉత్తర ప్రదేశ్ కెప్టెన్ గా రింకు సింగ్ అద్భుతమైన ప్రదర్శన ఘనపరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ట్రోఫీలో భాగంగా ఆడిన ఆరు మ్యాచ్లలో రింకు సింగ్ కెప్టెన్ గా అలాగే ఫినిషర్ గా ప్రతి ఒక్క మ్యాచ్లో రఫ్ ఆడిస్తున్నారు. వరుసగా ఆరు మ్యాచ్లలో 67(48),106*(60),63(67),37*(15),41(35),57(30) పరుగులు చేశారు. ప్రతి మ్యాచ్ లోను ఒక కెప్టెన్గా ఒక ఫినిషర్ గా తన మార్కును చూపించారు. అనూహ్యంగా కెప్టెన్సీ తో ప్రత్యర్ధులను ఉనికిస్తున్నారు. వరుసగా ఆరు మ్యాచ్లలో విజయాలు సాధించి గ్రూప్-B లో 24 పాయింట్లతో తన టీం ను అగ్రస్థానంలో నిలిపారు. రింకు సింగ్ ఇదే జోష్ తో టి20 వరల్డ్ కప్ లోను కొనసాగించాలి అని అతని అభిమానులు అలాగే ఇండియన్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ లో కోల్కత్తా జట్టు తరఫున ఒక మ్యాచ్ లో చివరి ఓవర్ లో వరుసగా 5 సిక్సులు కొట్టి మ్యాచ్ ను గెలిపించడంతో అప్పటినుంచి రింకూ సింగ్ కెరియర్ మారిపోయింది. ఆ తరువాత అతను టీమిండియా జట్టులోకి రావడం అక్కడ కూడా తన ప్రతిభను చూపించడంతో నేడు టి20 వరల్డ్ కప్పు జట్టులో సెలెక్ట్ అయ్యారు.
Read also : నన్ను పెళ్లి చేసుకుంటావా? విష్ణు ప్రియ ఫోన్ కాల్ వైరల్ (VIDEO)





