Sunday, March 22, 2026
Homeక్రీడలుఅభిషేక్ శర్మ పై జోష్యం చెప్పిన రికీ పాంటింగ్?

అభిషేక్ శర్మ పై జోష్యం చెప్పిన రికీ పాంటింగ్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత యువ ఓపెనర్, సిక్సర్ల వీరుడుగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్నటువంటి అభిషేక్ శర్మ పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. మరో నాలుగు రోజులలో జరగబోయేటువంటి T20 వరల్డ్ కప్ టోర్నీలో ఈ భారత యువ బ్యాటర్అభిషేక్ శర్మ టాప్ స్కోరర్ గా నిలుస్తాడు అని జోష్యం చెప్పారు. అంతే కాకుండా అభిషేక్ శర్మ ఈ టి20 వరల్డ్ కప్ లో “ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్” గా నిలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా ఉన్నటువంటి భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ కు విజయాలను అందిస్తాడు అని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్ మరియు శ్రీలంక వేదికలుగా ఈ T20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. ఈలోగా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ మన భారత క్రికెటర్ పై ప్రశంశలు కురిపించడం భారత్ కు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రికీ పాంటింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత జట్టులోని అభిషేక్ శర్మ మరియు ఇతర క్రికెటర్లకు కూడా జోష్ నింపే అవకాశాలు ఉన్నాయి. ఇదే జోష్ తోటి T20 వరల్డ్ కప్ భారత్ గెలిచిన గెలిచేస్తుంది.

వైన్ షాప్ కారణంగా ప్రశాంతతకు భంగం.. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన మహిళలు

Read also : Shocking Wedding Twist: పెళ్లి కొడుకుపై హత్యాయత్నం.. పెళ్లి కూతురి ఏడుపు.. సీన్ కట్ చేస్తే షాకింగ్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments