![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/images-2025-02-07T125137.924.jpeg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నేడు ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారని తెలిపారు. కాగా గత నవంబర్లో రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ అప్పుడు ఆర్జీవి పోలీసులు విచారణకు సహకరించలేదు. గతంలో చాలాసార్లు పోలీసులు విచారణకు రాంగోపాల్ వర్మ డుమ్మా కొట్టిన విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే ఆ కేసులలో అరెస్టు కాకుండా ఆర్జీవి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. తాజాగా ఇవాళ విచారణకు హాజరు కావాలని కోర్టు ఆర్జీవికి తెలుపగా, పోలీసుల విచారణకు ఒంగోలు వస్తానని పోలీసులకు ఆర్జీవి సమాచారం అందించారు. చెక్ బౌన్స్ కేసులో చాలాసార్లు ఆర్జీవికి విచారణలో భాగంగా ఒంగోలు రమ్మని పోలీసులు తెలుపగా చాలాసార్లు ఆర్జీవి డుమ్మా కొట్టారు. మరి ఇవాళ వస్తానని తెలిపిన ఆర్జీవి వస్తాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇవి కూడా చదవండి
1.పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్!… అప్డేట్ ఇచ్చిన డాక్టర్లు??
2.మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం!… 10వ స్థానంలో పవన్ కళ్యాణ్?