
క్రైమ్ మిర్రర్, వేములపల్లి:- వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో సర్వే నెంబర్–1లో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి రాళ్లతో కంచెలు ఏర్పాటు చేసిన ఘటనపై రెవెన్యూ అధికారులు కఠినంగా స్పందించారు. గురువారం ఉదయం విషయం తెలుసుకున్న వేములపల్లి తహసీల్దార్ హేమలత స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి అక్రమ కబ్జాలపై విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రాళ్ల కంచెలను పూర్తిగా తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలో ఎవరైనా ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు. ఈ చర్యలతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేయగా.. బాధితుడు దేశబోయిన వెంకటయ్య మాట్లాడుతూ ఆ ప్రాంతంలో పూర్వం నుండి తమ తెగల కుటుంబాలు శవాల ఖననం కోసం, బొందల గడ్డగా ఉపయోగిస్తుండగా ఇటీవల సర్వే నెంబర్–1లో చాలామంది భూమిని అన్యాక్రాంతం చేసి గడ్డివాములు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ వాటిని కూడా వెంటనే తొలగించి ప్రభుత్వ భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read also : ‘లే నాన్న.. అన్నం తినిపిస్తా’.. కన్నీళ్లు పెట్టిస్తున్న VIDEO
Read also : సీఎం VS మాజీ సీఎం.. తారస్థాయికి చేరిన విమర్శల వే’ఢీ’





