
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయింది కదా.. ఈ రెండు సంవత్సరాలలో హైదరాబాద్, జూబ్లీహిల్స్ లాంటి నగరాలకు మీరు ఏం చేశారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్ లోనే రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని కేటీఆర్ అన్నారు. చెత్త నా కొడకా అంటూ ఆయన ఎలా పడితే అలా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని.. అతని భాషలో అర్థం అయ్యేలా చెప్పే సత్తా మాకు ఉన్నా కానీ మేము వాళ్ళలా కాదు. మేము చాలా గౌరవంగానే మాట్లాడుతాం.. గౌరవప్రదంగానే నడుచుకుంటాము అని.. కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. గత పది ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో నేను చెప్తా… గడిచిన రెండేళ్లలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమా?.. అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. చెత్త ఎవరిదో.. సత్తా ఎవరిదో తేల్చుకుందాం రా .. అని కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉత్కంఠంగా మారింది. మరి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అని అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : ఓట్ల చోరీపై కోర్టును ఆశ్రయించండి.. రాహుల్ గాంధీ పై BJP ఫైర్
Read also : మరి కాసేపట్లో అద్భుతం జరగనుంది.. ” 6.49 ” ఈ టైం గుర్తుపెట్టుకోండి..?





