క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చింది. సంక్రాంతికి రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు మాట మార్చింది. రైతు భరోసా కోసం మళ్లీ రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. త్వరలోనే ఇందు కోసం ప్రత్యేక వెబ్ సైట్ లేగా యాప్ రూపొందించనుంది. ఇందులో రైతుల వివరాలతో పాటు భూమి సాగులో ఉందా.. లేదా అన్నది తేల్చనున్నారు. సాగు భూమికి సంబంధించిన ఫోటోలు యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అధికారులు పరిశీలించి భూమి సాగులో ఉందా .. లేదా నిర్ణయించి రైతు భరోసాకు అర్హులే కాదో తేల్చనున్నారు. సంక్రాంతికి రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఆ దిశగా స్పీడ్ పెంచుతోంది. రైతు భరోసా మారదర్శకాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమైంది.
Read Also : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!
సబ్ కమిటీ సభ్యులు శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్ సబ్‌కమిటీ గంటన్నరపాటు చర్చించింది. సంక్రాంతికే రైతు భరోసా ఇవ్వాలని మంత్రి వర్గం సబ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసింది. అయితే రైతు భరోసా విధివిధానాలపై మరోసారి భేటీ కావాలని సబ్ కమిటీ నిర్ణయించింది.. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలనే యోచనలో ఉన్న రేవంత్ సర్కార్.. ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలనే విషయంపై మాత్రం క్లారిటీకి రాలేకపోతోంది.టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటించాలని సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక సాగు భూమి లెక్క తేల్చేందుకు గూగుల్ డేటా, శాటిలైట్ ఆధారంగా పలు కంపెనీల నుంచి డేటా సేకరిస్తోంది. ఇదంతా జరగటానికి మరింత సమయం పట్టే అవకాశంఉండటంతో సంక్రాంతికి రైతు భరోసా డబ్బులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :