
సీఎంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆర్థిక మంత్రిగా రోశయ్య జోడి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. అలాంటిది.. మళ్లీ ఇన్నాళ్లకు తెలంగాణలో అలాంటి జోడీ కనిపిస్తోంది. అది ఎవరో కాదు… సీఎం రేవంత్‌రెడ్డి-ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేవంత్-భట్టి కాంబినేషన్… సూపర్ హిట్ అవుతోంది. వీరిద్దరికీ కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా వాహ్వా అంటోందంటే అతిశయోక్తి కాదు.
రోశయ్య వివాదాలకు దూరంగా ఉంటారు.. మంచి సలహాదారుడు. అన్ని శాఖలపై ఆయనకు పట్టు ఉండేది. వైఎస్ రాజేశఖర్‌రెడ్డి హయంలో… ఆర్ధిక మంత్రిగా పనిచేశారు రోశయ్య. అప్పట్లో వైఎస్‌ఆర్-రోశయ్య జోడీ అదుర్స్ అనేవాళ్లు. ప్రతిపక్షాలను తనదైన శైలిలో.. హాస్య చతురతతో పంచ్‌లు వేయడంలో రోశయ్య దిట్ట. విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వెన్నుదన్నుగా ఉండేవారు… ఆయనకు రాజకీయ సలహాలు కూడా ఇచ్చేవారు రోశయ్య. అందుకే వైఎస్‌ఆర్-రోశయ్య జోడీకి మంచిపేరొచ్చింది. మళ్లి ఇప్పుడు.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి-భట్టి విక్రమార్క జోడీ అలాంటి పేరే తెచ్చుకుంటోంది. రేవంత్‌రెడ్డి-భట్టి విక్రమార్కను చూసిన వారంతా… వైఎస్ఆర్-రోశయ్య జోడీ మళ్లీ రీపిట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు.
Read More : CM Revanth Reddy : పదేళ్లు నేనే సీఎం.. భట్టి, ఉత్తమ్‍కు రేవంత్ షాక్!
భట్టి విక్రమార్క… కాంగ్రెస్‌లో సీనియర్ నేత. మృదుస్వభావి, సౌమ్యుడు. వివాద రహితుడు. కాంగ్రెస్‌కు విధేయుడు. ముఖ్యమంత్రి అయ్యేందుకు భట్టి విక్రమార్కకు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ… పార్టీ హైకమాండ్ సూచన మేరకు డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నారు. ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి చేదుడు వాదోడుగా ఉంటున్నారు. ఇంకెవరైనా సీఎం పోస్టు ఆశించి… డిప్యూటీ సీఎం పదవిలో ఉంటే.. కుట్రలు, కుయుక్తులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. సీఎం కుర్చీ ఎప్పుడెప్పుడు లాగేసుకుందామా..? అని చూసేవారు. ఉదాహరణకు కర్నాటకలో చూడండి…సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లో సీఎం ఎవరనేది ఎన్నుకునేందుకు హైకమాండ్‌కు తల బొప్పికట్టింది. ఎలాగోలా సిద్ధరామయ్యను సీఎంగా చేశారు. కానీ… సిద్ధరామయ్య, డీకే మధ్య ఇప్పటికీ సయోధ్య లేదని… వారివి వేరువేరు గ్రూపులన్న ప్రచారం ఉంది. కానీ… భట్టి విక్రమార్క అలాకాదు.. తనకు సీఎం పదవి దక్కకపోయినా… అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. సీఎం కుర్చీ కోసం కొట్లాడకుండా… ముఖ్యమంత్రిని వెనకుండి నడిపిస్తున్నారు.
Read More : టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?
సీఎం రేవంత్‌రెడ్డి.. భట్టి విక్రమార్కకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎప్పుడూ మా భట్టి అన్న… మా భట్టి అన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. ఎప్పుడూ పక్కనే కూర్చోబెట్టుకుంటారు రేవంత్‌రెడ్డి. ఢిల్లీ పర్యటనకు కూడా భట్టి విక్రమార్కను వెంట బెట్టుకుని తీసుకెళ్తారు. ఏ నిర్ణయమైనా… భట్టి విక్రమార్కతో చర్చించాకే తీసుకుంటారని కూడా సమాచారం. భట్టి విక్రమార్క కూడా… తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా… ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేస్తూ… సీఎం రేవంత్‌రెడ్డికి అడుగడుగునా అండదండగా ఉంటున్నారు. ప్రస్తుతం.. సీఎం రేవంత్‌రెడ్డిది, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కది ఒకటే మాట. అది చూసి కాంగ్రెస్ హైకమాండ్ కూడా మెచ్చుకుంటోంది. వీరిద్దరి మధ్య బాండింగ్ గట్టిగా ఉండటంతో… రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గంలోని మంత్రులు కూడా ఏం చేయలేకపోతున్నారు. మారు మాట్లాడకుండా… ముఖ్యమంత్రికి సహకరించాల్సి వస్తోందని పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఇకేముంది… రేవంత్-భట్టి జోడీ సూపర్ హిట్ అంటోంది రాజకీయ ప్రపంచం.