
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :-నామినేషన్ స్వీకరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. గురువారం మహాదేవపూర్ గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణలో రిటర్నింగ్ అధికారి ద్వంద వైఖరిని ప్రదర్శించారు. అధికార పార్టీ సర్పంచి అభ్యర్థి నామినేషన్ వేసేందుకు రాగా వారికి ఫోటో తీసికునేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఓ వైపు ప్రెస్ కు సంబంధించి అనుమతి లేదంటూనే మరోవైపు అధికార పార్టీ అభ్యర్థికి ఫోటోలకు అనుమతించడంపై పలుగురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి ఓ న్యాయం, ప్రతిపక్షాలకు, ప్రజలకు, మీడియాకు ఓ న్యాయమా? అంటూ మండిపడుతున్నారు. దీనిపై ఎలక్షన్ అబ్జర్వర్, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read also : శాస్త్రీయత లేని నిర్ణయం..! పాలనా సౌలభ్యం… ప్రజలకు కొత్త కష్టాలే..!!
Read also : Funny video: కుక్క, బాతుల విన్యాసాలు.. మాములుగా లేవుగా.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..





