
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 45 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఎంతోమంది నష్టపోయారు. పంటలు దెబ్బతిని రైతులను నష్టపోగా, మరికొన్ని చోట్ల కూలీ పనులకు వెళ్లలేక ఆహారం కూడా కష్టమవుతుందని చాలామంది నిరుపేద రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా… వాతావరణ శాఖ అధికారులు ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రానున్న మరో మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. దీంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి.
ఏపీలో రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు:-
1. శ్రీకాకుళం
2. విజయనగరం
3. మన్యం
4. అల్లూరి సీతారామరాజు
ఏపీలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు :-
1. నంద్యాల
2. నెల్లూరు
3. తిరుపతి
4. ఏలూరు
5. ఎన్టీఆర్
పైన ప్రకటించిన ఈ 9 జిల్లాలలో కూడా మరో మూడు గంటల నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతే కాకుండా మరో రెండు మూడు రోజుల్లో అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ద్వారా మరి కొద్ది రోజులపాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని… అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. ప్రస్తుతం దసరా సెలవులు సందర్భంగా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి… తల్లిదండ్రులు వారిపై ఒక కన్నేసి ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read also : ర్యాగింగ్ తట్టుకోలేక… ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి!