
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ప్రజలు వణికి పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలలో భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం… భారీ ఈదురుగాలులతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని.. తద్వారా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. దాదాపు ఈ వర్షాలు రెండు రోజులు పాటు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిచోట్ల 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, మరోవైపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం మరియు మంగళవారం రోజుల్లో శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాలలో పిడుగులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు అనకాపల్లి, కృష్ణ, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, ఉపయోగ గోదావరి అలాగే తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. తాజాగా ఈ అకాల వర్షాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత… వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున పంట నష్టం జరగకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో భారీ వర్షాలు పడడంతో… చాలాచోట్ల పెద్దపెద్ద చెట్లు నేలకొరిగాయి. కొన్ని రహదారులపై ఏకంగా మోకాలి లోతు నీరు నిలిచిపోయి… ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు… వరునుడు లేదా వాయువు ఒకటి ఎక్కడ బంధించేస్తారు అని ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కేవలం నిన్న ఒక్కరోజులోనే ఏకంగా ఈ భారీ వర్షాల కారణంగా 8 మంది మృతి చెందడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు మరణించగా, మరో ప్రాంతంలో చెట్టు కూలి ఒక బాలుడు, షాక్ తగిలి మరొకరు మరణించారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
అమరావతే రాజధాని… మరి వైసిపి మాటలు జనాలు ఉంటారా?
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు – వాస్తవాలపై చర్చా కార్యక్రమం: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్