క్రీడలు

న్యూజిలాండ్ తో సమరానికి సిద్ధం.. ప్రాక్టీస్ మొదలు పెట్టిన దిగ్గజ ప్లేయర్లు

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరుగునున్న వన్డే సిరీస్ కు భారత ప్లేయర్లు సిద్ధమయ్యారు. వన్డే మ్యాచ్ కాబట్టి ఈ వన్డే సిరీస్ కు రోహిత్ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆడునున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు వడోదర క్రికెట్ మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కేవలం బ్యాటింగ్ తోనే పరిమితం కాకుండా ఫీల్డింగ్ మరియు క్యాచింగ్ విషయాల్లో కూడా దిగ్గజ ప్లేయర్లు రోహిత్, కోహ్లీలు చెమటలు చిందిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బీసీసీఐ పోస్ట్ చేసిన ఈ వీడియోలను చూస్తున్నా రోహిత్, కోహ్లీల అభిమానులు ఈ వీడియోలను షేర్ చేస్తూ తెగ సంతోష పడుతున్నారు.

Read also : ప్రభాస్ కు షాకుల మీద షాక్స్.. ఆన్లైన్ లో HD ప్రింట్?

కేవలం వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్న వీరిద్దరూ భీకరమైన ఫామ్ లో ఉండడం కారణంగా ఫ్యాన్స్ సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వన్డే ఫార్మాట్ లోనే ప్రేక్షకులను వీరిని కళ్ళారా చూడొచ్చు కాబట్టి టికెట్స్ కూడా వెంటనే సోల్డ్ అయిపోతున్నాయి. న్యూజిలాండ్ తో జరిగేటువంటి ఈ వన్డే మ్యాచ్లో మరోసారి వారిద్దరూ మంచి ప్రదర్శన కనబరిస్తే ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్పుకు చోటు దక్కించుకోగలరు అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ కప్ లో వీరిద్దరూ ఆడితే అదే చాలు అంటూ ఎంతో మంది ఫ్యాన్స్ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో కోరుతున్నారు. బహుశా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే వరల్డ్ కప్పు కచ్చితంగా ఆడేందుకు ఇప్పటినుంచి ఒక వైపు ఫిట్నెస్ పరంగా మరోవైపు ఆట ప్రదర్శన పరంగా కఠోరశ్రమలు చేస్తున్నారు. దీంతో ఫాన్స్ కోరికను దృష్టిలో పెట్టుకొని వీరిద్దరూ చేస్తున్న శ్రమకు సలాం కొడుతున్నారు. రేపటి నుంచి ఇరుదేశాల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.

Read also : అర్థరాత్రి ఎలుకల మందు ఆర్డర్ చేసిన మహిళ.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button