
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. 2024వ సంవత్సరంలో తొలి ట్రోఫీని గెలిచినటువంటి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా కప్పు గెలిచే దిశగా అడుగులు వేస్తుంది. ఈ టోర్నీ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా విజయాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది వరుసగా 5 విజయాలు ఖాతాలో వేసుకోగా గత ఏడాది కూడా చివరి మ్యాచ్ గెలవడంతో వరుసగా ఆరు మ్యాచ్లలో విజయాన్ని సాధించి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. జట్టులోని ఎవరో ఒకరు ఒక్కొక్క మ్యాచ్లో రాణిస్తుండడంతో మ్యాచ్ విజయాలను సులభంగా అందుకుంటుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి బ్యాటింగ్ లోను మరోవైపు బౌలింగ్ లోను బలమైన జుట్టుగా కొనసాగుతుంది. నిన్న రాత్రి గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో RCB విజయం సాధించడంతో డైరెక్ట్ గా ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. స్మృతి మందనా కెప్టెన్సీ సారధ్యంలో మరోసారి కప్పు గెలవాలి అని ఆర్సిబి అభిమానులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా గత కొద్ది రోజుల క్రితం స్మృతి మందన పెళ్లి వ్యవహారం క్యాన్సిల్ అయ్యి ఆమె చాలా లోతైన వాదులో ఉంటుంది అని ప్రతి ఒక్కరూ భావించిన కూడా.. ఈరోజు ఆమె అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆమె పట్టుదల అలాగే మనోధైర్యాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.
Read also : UAE President: 3 గంటల పర్యటన కోసం 6 గంటల ప్రయాణం.. ఏం జరుగుతోంది?
Read also : Trump Letter: నాకే నోబెల్ ఇవ్వరా? ఇక శాంతి గురించి ఆలోచించేది లేదన్న ట్రంప్!





