
క్రైమ్ మిర్రర్, మహేశ్వరం:- హైదరాబాద్ శివారుల్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పరిధిలోని కే.చంద్రారెడ్డి రిసార్ట్‌లో అర్ధరాత్రి రాచకొండ పోలీసు కమిషనరేట్ ఎస్‌ఓటీ (Special Operations Team) సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. సమాచారం మేరకు, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ప్రముఖ ఫర్టిలైజర్ కంపెనీ తమ వ్యాపార డీలర్లకు ప్రత్యేకంగా సెలబ్రేషన్ పార్టీ పేరుతో ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ వేడుక క్రమంగా రేవ్ పార్టీగా మారి, మద్యం, స్త్రీలతో ఉత్సాహంగా సాగిందని దర్యాప్తులో బయటపడింది.
Read also : మరో 3 రోజులు పాటు ఈ జిల్లాలకు ముప్పు..!
దాడుల సందర్భంగా పోలీసులు 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో చాలామంది ఆ కంపెనీ ఉద్యోగులు, డీలర్లు, స్నేహితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. స్థలంలో భారీగా లిక్కర్ బాటిళ్లు, మ్యూజిక్ సిస్టమ్‌లు, మత్తు పదార్థాల అవశేషాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రాచకొండ ఎస్ఓటీ అధికారులు రిసార్ట్ యాజమాన్యాన్ని కూడా విచారణకు పిలిపించారు. ఈ రేవ్ పార్టీ వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి, ఇందులో ఎవరెవరు ప్రముఖులు పాల్గొన్నారు అనే దానిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో అలజడి రేపిన ఈ ఘటనతో మహేశ్వరం పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read also : పక్కకు తప్పుకున్న శ్రీ లీల.. అఖిల్ కు జోడిగా సరికొత్త హీరోయిన్