క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్లో బిజీబిజీగా గడుపుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా రామ్ చరణ్ కు గాయమైనట్లుగా సమాచారం. రామ్ చరణ్ కంటికి చిన్న గాయమైనట్లుగా సోషల్ మీడియాలో సమాచారం వైరల్ అవుతుంది. అయితే రామ్ చరణ్ కంటికి చిన్న గాయం మాత్రమే తగిలిందని మరో రెండు మూడు రోజులపాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్లు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ పెద్ది సినిమా పలుమార్లు పోస్ట్ పోన్ అవుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. పెద్ది సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఫాన్స్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అందరూ కూడా తెగ పోస్టులు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ కు గాయం పై చిత్ర బృందం ఎటువంటి ప్రకటన అయితే ఇప్పటివరకు అధికారికంగా తెలియజేయలేదు. కాబట్టి మూవీ టీం రామ్ చరణ్ గాయం పై క్లారిటీ ఇచ్చేదాకా ఈ వార్తలపై ఒక స్పష్టత అయితే రాదు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి విడుదలైనటువంటి సాంగ్స్ అలాగే కొన్ని గ్లింప్స్ వంటివి ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాను ఎంతో ప్రత్యేకంగా చేస్తున్నారు. గేమ్ చేంజర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
రింకూ సింగ్ అభిమానులకు గుడ్ న్యూస్!
అలెర్ట్!.. 3 రోజులు పాటు పిడుగులతో కూడిన వర్షాలు
