
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:-
ఆమాత్య.. అని పిలిపించుకోవాలని ఆరాట పడుతున్నారు ఆ రాజు గారు. మంత్రి పదవి తనను వరిస్తుందని… ప్రతిరోజూ కలలు కంటున్నారు. లెక్కలు వేసుకుని.. బెర్త్ కోసం కర్చీఫ్ చేతిలో పెట్టుకుని ఉన్నారట. మరి కల నెరవేరుతుందా…? పగటి కలగా మిగిలిపోతుందా..? ఇంతకీ ఎవరా రాజు గారు..?
Read also : పులివెందులలో పోటాపోటీ – వైసీపీ పట్టు నిలిచేనా…? టీడీపీ పంతం నెగ్గేనా..?
విష్ణుకుమార్‌రాజు… ఏపీ బీజేపీ ఎమ్మెల్యే. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు శాసనసభాపక్ష నేతగానూ ఉన్నారు. ఇప్పుడు మంత్రి కావాలని కలలు కంటున్నారు. కేబినెట్‌లో బర్త్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమిలో బీజేపీ కూడా ఉంది. కనుక… ఈసారి తన కల తప్పక నెరవేరుతుందన్న ఆశ ఆయనది. ఏపీలో కేబినెట్ విస్తరణ జరిగితే… బీజేపీ మరో బర్త్ కోసం పట్టుబట్టాలని భావిస్తోంది. ఆ బర్త్.. తనకే రావాలని కోరుకుంటున్నారట విష్ణుకుమార్‌రాజు. మంత్రిగారు అని పిలిపిచుకునేందుకు తహతహలాడుతున్నారాయన. మంత్రి పదవి కోసం… సమీకరణలు సరిపోల్చుకున్నారు. తనకే పదవి దక్కుతుందని… లెక్కలేసుకున్నారు. అదృష్టం కూడా తన వెంటనే ఉంటే… మినిస్టర్‌ని అయిపోతానని ఆశలు పెంచుకుంటున్నారు. ఇంతకీ… రాజు గారి లెక్క కరెక్టేనా…?
Read also : AI పేరుతో శ్రీవారి ధనాన్ని వృధా చేయకండి.. తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం అసంభవం : టీటీడీ మాజీ EO
ఏపీ కేబినెట్ విస్తరణ అంటూ జరిగితే… బీజేపీలో ఇంకో మంత్రి రావడం మాత్రం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే.. ఆ పదవిని కమలం పార్టీ ఎవరికి కట్టబెడుతుందనేదే ఇక్కడ ప్రశ్న. విశాఖ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది విష్ణుకుమార్‌రాజుకు కలిసొచ్చే మొదటి పాయింట్. రెండుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు శాసనసభాపక్ష నేతగా ఆయనకు అనుభవం ఉంది. ఇది రెండో ప్లస్ పాయింట్. ఏపీలోని కూటమి పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మూడో ప్లస్ పాయింట్. ఇన్ని ప్లస్‌లు ఉన్నాయి కనుక.. ఈసారి మంత్రి పదవి తనదే అని ఊహించుకుంటున్నారట విష్ణుకుమార్‌రాజు. ఊహలే కాదు.. లాబీయింగ్ కూడా మొదలుపెట్టేశారట. ఎలాగైనా.. ఈసారి తనకి మినిస్టర్ పదవి దక్కి… రాజు గారు అని కాకుండా.. మంత్రి గారు అని పిలిపించుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఆయన ఆశ ఎలా ఉన్న.. వచ్చే ఒక్క మంత్రి పదవి కోసం… కమలం పార్టీలో పోటీ తీవ్రంగానే ఉంది. కనుక… విష్ణుకుమార్‌రాజు కల నెరవేరుతుందో…? కలగానే మిగిలిపోతుందో…? చూడాలి.
Read also : ‘ఆటంబాంబు’ పేల్చండి.. రాహుల్‌కు రాజ్‌నాథ్ సవాల్!