
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండం గా, రేపటికి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని తాజాగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు లేదా ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు దంచుకొడతాయని అధికారులు తెలిపారు. ఈనెల 28వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశాలు ఉన్నాయని.. తద్వారా ఈనెల 28వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మరి ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలలో మోస్తరు నుంచి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.
Read also : రష్మికాను ఆట పట్టించిన అల్లు అరవింద్..!
బాగా ఇప్పటికే ఈ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా వర్షాలపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాలలో అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అలాగే రాగల నాలుగు రోజుల్లో ఏపీతోపాటుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, సౌరాష్ట్ర, చతిస్గడ్ వంటి రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది. రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కూడా రాయలసీమ మరియు కోస్తాంధ్ర జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ముందుగానే హెచ్చరించింది. కాగా మొత్తా తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. మరి ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకు మరిన్ని హెచ్చరికలు చేస్తున్నారు.
Read also : రష్మికాను ఆట పట్టించిన అల్లు అరవింద్..!





