
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 26వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తెలికపాటి వర్షాలు నమోదయ్య అవకాశాలు ఉన్నాయని IMD కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాలలో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.
ఎల్లో అలెర్ట్ ప్రకటించిన జిల్లాలు
1. భద్రాద్రి
2. నల్గొండ
3. ఖమ్మం
4. సూర్యాపేట
5. వరంగల్
6. మహబూబాబాద్
7. హనుమకొండ
8. జనగాం
9. సిద్దిపేట
10. రంగారెడ్డి
11. యాదాద్రి
12. హైదరాబాద్
13. మేడ్చల్
14. వికారాబాద్
15. సంగారెడ్డి
16. మెదక్
17. కామారెడ్డి
18. ఉమ్మడి మహబూబ్నగర్
ఈ 18 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హలో అలెర్ట్ ప్రకటించారు. కాబట్టి ప్రజలందరూ కూడా మరో నాలుగు రోజులపాటు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. కొంతమంది వాహనదారులు రోడ్లమీద వెళ్లాలంటేనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాల వైపు, చెట్ల క్రింద నిలబడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
Read also : ఏపీ ఇంటర్ విద్యార్థులు అలర్ట్… పరీక్షల మార్కులలో మార్పులు?
Read also : కార్తీకమాసం ఎఫెక్ట్.. కిటకిట లాడబోతున్న దేవాలయాలు..!