Tuesday, February 24, 2026
Homeతెలంగాణతెలంగాణకు వర్ష సూచన.. వచ్చే రెండు రోజులు బీఆలర్ట్

తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే రెండు రోజులు బీఆలర్ట్

తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన చేసింది. తెలంగాణలో ఇవాళ పలు జిల్లాల్లో వాన కురిసే అవకాశం వుందని తెలిపింది. భారీ వర్షాలకు తావులేదని, తేలికపాటి వాన కురుస్తుందని తెలిపింది. దీనికి తోడు తెలంగాణను చలి చంపేస్తోంది. రానున్న రెండు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కాస్త జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు.

తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పడిపోయాయి. రానున్న 5 రోజులు అక్కడక్కడ ఉదయం వేళ పొగమంచు కురిసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. రేపు, ఎల్లుండి పొగమంచు ఎక్కువగా ఉంటుందంటున్నారు. రేపు 20-27 డిగ్రీలు, ఎల్లుండి 18-27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేసారు. ఎలాంటి హెచ్చరికలు లేకపోయినప్పటికీ.. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇక నైరుతి, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో గత మూడ్రోజులు వర్షాలు కురిశాయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments