
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఇంగ్లాండ్ వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ లో కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ తో చెలరేగారు. 176 బంతుల్లో శతకం పూర్తి చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. చాలా స్లోగా స్టార్ట్ చేసిన కేఎల్ రాహుల్ మెల్లిమెల్లిగా సెంచరీ చేసుకొని స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్న సమయంలో వెంటనే బ్రూక్ కు క్యాచ్ ఇచ్చి షోయబ్ బషీర్ చేతిలో అవుట్ అయ్యారు. రెండవ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ అనవసరమైన రన్ తిరగడానికి ప్రయత్నించి 74 పరుగుల వద్ద రన్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం రవీంద్ర జడేజా మరియు నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ కూడా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో ఉన్నారు.
కథ మూడవ టెస్టులో యశస్వి జైస్వాల్ మరియు గిల్ ఇద్దరు కూడా విఫలమయ్యారు. కరుణ్ నాయక్ 40 పరుగులతో రాణించి అవుట్ అయ్యారు. మూడవ టెస్టులో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం ఇండియా చేజింగ్లో 268 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి చేజ్ చేసే పనిలో పడింది. ఇంకొక రోజు ఆట మిగిలి ఉండడంతో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆత్రుతగా మ్యాచ్ను వీక్షిస్తున్నారు.