ఆంధ్ర ప్రదేశ్

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు

2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించారు.

ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ కానున్నారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఒకటి రెండ్రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. అప్పటి సీఎం జగన్‌కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు.. అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపించారు.

దీంతో ఆగ్రహించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి, కస్టడీలో చిత్రహింసలు పెట్టింది. ఆయన్ను వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి అడుగుపెట్టనీయకుండా వెంటాడారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయపోరాటం చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆయన.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

కొడంగల్ అల్లర్లు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం అరెస్ట్

అధికారులపై దాడి గుండాల కుట్ర..దాడి ఘటనలో నిఘా విభాగాలు విఫలం.!

కొడంగల్ దాడుల వెనుక కేటీఆర్ హస్తం!

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button