
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:- విదేశాల్లో భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సౌరబ్ ఆనంద్ అనే భారత విద్యార్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సౌరబ్ చేయి పూర్తిగా తెగిపోయింది.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం, సౌరబ్ ఆనంద్ ఇటీవల ఓ ఫార్మసీ నుంచి మందులు తీసుకుని ఇంటికి వెళుతుండగా ఐదుగురు యువకులు అతనిపై ఆకస్మికంగా దాడి చేశారు. దాడి తీవ్రతతో సౌరబ్ కుడి చేయి అక్కడికక్కడే తెగిపడింది. ఈ ఘటనలో అతని మెడకు, తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఏసీబీ వలలో చిక్కినట్టే చిక్కి.. పరారైన పంచాయతీ కార్యదర్శి!
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన సౌరబ్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యాధునిక చికిత్స పద్ధతులతో దాదాపు తొమ్మిది గంటలపాటు శ్రమించి, సౌరబ్ తెగిపోయిన చేతిని తిరిగి అతికించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
దాడికి పాల్పడిన ఐదుగురు యువకుల్లో నలుగురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం, జాతి విద్వేష దాడి వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘటనతో స్థానికంగా భారత విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భారత విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని మెల్‌బోర్న్ పోలీసులు వెల్లడించారు.
ఏసీబీ వలలో చిక్కినట్టే చిక్కి.. పరారైన పంచాయతీ కార్యదర్శి!