
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- ఆదిభట్ల పోలీసు స్టేషన్ ను రాచకొండ కమిషనర్ జి.సుధీర్ బాబు,ఐ,పీ,ఎస్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ నడవడికలను,ఫిర్యాదు దారుల పట్ల గౌరవ మర్యాదలతో మసలు కోవాలని వారి ఫిర్యాదులకు తక్షణ న్యాయం చేయాలని, పోలీసు స్టాఫ్ విధుల పట్ల నిర్లక్షం చేయరాదని పోలీసుల పట్ల ఉన్న గౌరవాన్ని సమాజంలో పెంచే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి అని అన్నారు. రాబోవు గణేశ్ నవరాత్రుల సంధర్భంగా పటిష్ట మైన బందో బస్త్ ఏర్పాటు చేసి శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విధులు నిర్వర్తించి గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణం లో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలి అని సూచించారు. అలాగే పోలీసు స్టేషన్ లో నమోదు అయిన కేసుల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డీసీపీ.డి.సునీత రెడ్డి, ఇబ్రాహీం పట్నం ఏ సిపి కే పి వి.రాజు, బి.రవి కుమార్,ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఆదిభట్ల పీ ఎస్,మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read also : అప్రూవర్‌గా నారాయణస్వామి.. క్లైమాక్స్‌కి చేరిన ఏపీ లిక్కర్ స్కామ్..!
Read also : మారుతున్న నెల్లూరు రాజకీయం.. చేతులు కలిపిన అనిల్, కాకాణి