
Putin India Visit: అమెరికా టారిఫ్ హెచ్చరికల నేపథ్యంలో భారత్, రష్యా, చైనా మరింత దగ్గర అవుతున్నాయి. సుమారు ఏడు ఏండ్ల తర్వాత భారత ప్రధాని మోడీ చైనా పర్యటనకు వెళ్తుండగా, త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రాబోతున్నారు. ఈ మూడు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్న వేళ, ఈ దేశాలు మరింత దగ్గర కాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న చైనా-భారత్ మధ్య కూడా స్నేహం చిగురిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా అధ్యక్షుడు త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోదంఇ.
భారత పర్యటనకు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది చివరలో భారత్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తేదీల ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ వెల్లడించారు. రష్యా పర్యటనలో ఉన్న దోవల్.. రష్యా భద్రతామండలి కార్యదర్శి సెర్గీ షొయిగుతో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన చేశారు. మరోవైపు పుతిన్ తోనూ దోవల్ సమావేశమయ్యారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేస్తుదనే కారణంగా అమెరికా టారిఫ్ లు విధంచడంపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. అదే సమయంలో రక్షణ సంబంధం సహకారంపైనా మాట్లాడుకున్నారు.
ప్రధాని మోడీకి బ్రెజిల్ అధ్యక్షుడి ఫోన్
అటు బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డసిల్వా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కాల్ చేశారు. భారత్ పై అమెరికా సుంకాల భారం మోపిన వేళ మోడీతో బ్రెజిల్ అధ్యక్షుడు మాట్లాడ్డం ఆసక్తి కలిగిస్తోంది. అటు బ్రెజిల్ పైగా ట్రంప్ 50 శాతం టారిఫ్ లు విధించాడు. నిజానికి తాజాగా జరిగిన బ్రిక్స్ సమావేశం తర్వాత.. బ్రిక్స్ దేశాలపై క్షక్షగట్టి వ్యవహరిస్తున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Read Also: రైతుల ప్రయోజనాలే ముఖ్యం, ట్రంప్ టారిఫ్ లపై మోడీ కౌంటర్!