
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు తరుపున వంటి చేతితో ఎన్నో మ్యాచ్లు గెలిపించిన మాక్సివల్ కు ఐపీఎల్ లో నిరాశ ఎదురయింది. ఎందుకంటే అంతర్జాతీయ మ్యాచ్లలో ఆస్ట్రేలియా జట్టు తరుపున ఎంత బాగా రాణించిన కూడా ఐపీఎల్ లాంటి లీగ్లలో మాత్రం మాక్సివల్ కు అసలు అదృష్టం అనేది లేదు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన అన్ని మ్యాచ్లలో కూడా ఫ్యాన్స్ అందరు కూడా ఆందోళనలో ఉన్నారు. అయితే తాజాగా ఈ ఆస్ట్రేలియా స్టార్ హిటర్ మాక్సివల్ ను పంజాబ్ కింగ్స్ జట్టు వదిలేసింది. మాక్సివల్ తో పాటుగా కుల్దీప్ సెన్, విష్ణు వినోద్ మరియు హరుణ్ హార్డి అనే ముగ్గురు ప్లేయర్లను విడుదల చేసింది. ఆస్ట్రేలియా టీం లో విధ్వంసకర ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది మాక్సివెల్ అని ప్రతి ఒక్కరు కూడా చెబుతుంటారు. కానీ ఐపీఎల్ లో మాత్రం ఈ విధ్వంసకర ఆటగాడు గత కొన్ని సీజన్లుగా ఏ జట్టు తరఫున ఆడినా కూడా తేలిపోతున్నారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున ఏడు మ్యాచ్లాడిన గ్లెన్ మాక్సివల్ కేవలం 47 పరుగులు మాత్రమే చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ మాక్సివెల్ ను భారంగా భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే జట్టు నుంచి వదిలించుకున్నట్లు సమాచారం.
Read also : Gold Rates: తగ్గిన బంగారం ధరలు
Read also : PM Modi: కాంగ్రెస్ కాదు, అదో ముస్లిం లీగ్-మావోయిస్ట్ పార్టీ.. బీహార్ విజయం తర్వాత ప్రధాని మోడీ ఎద్దేవా!





