
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కీర్తిశేషులు ఊదరి సంజీవ కుటుంబానికి రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్ట్ ఆర్థిక సహాయాన్ని అందజేసింది.
మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డా. రావుల మాధవరెడ్డి సహకారంతో, ట్రస్ట్ కార్యదర్శి ఎండి ఖయ్యూం 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. గ్రామ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈ సహాయం జరగడం విశేషం.
ఈ సందర్భంగా ఖయ్యూం మాట్లాడుతూ, “చౌటుప్పల్ మండలంలోని ప్రతి గ్రామంలో ఆపదలో ఉన్న నిరుపేద కాంగ్రెస్ కుటుంబాలకు రాజీవ్ ట్రస్ట్ మద్దతుగా నిలుస్తుంది,” అని తెలిపారు.
కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి నల్ల నరసింహ, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాచకొండ భార్గవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఊదరి శ్రీనివాస్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ కొంతం బుచ్చిరెడ్డి, నాయకులు కొంతం రామకృష్ణారెడ్డి, ఐతరాజు లింగస్వామి, ఊదరి శంకర్, జువ్వి నరసింహ, ఎంగలి భీమిరెడ్డి, ఊదరి పోచయ్య, ఐతరాజు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.