ఆంధ్ర ప్రదేశ్

ఆలయాల్లో అర్చకులకే సర్వాధికారాలు..

దేవాలయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో పూజలు సహా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కీలక సంచలన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఆయా దేవాలయాల్లో అధికారుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ కమిషనర్ సహా ఏ స్ఖాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.

అర్చకులకు విస్తృతాధికారులు ఇస్తూ జీవో 223 విడుదల చేసింది చంద్రబాబు ప్రభుత్వం. పూజలు, సేవలు, యాగాలలో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా దేవాలయాల ఆచారాల ప్రకారం విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పించింది. పూజలు, ఇతర సేవల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.అవసరమైతే వైదిక కమిటీల ద్వారా ఈవో అభిప్రాయాలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని సూచించింది. ఆయా దేవాలయాల ఆగమ శాస్త్రాల ప్రకారమే వైదిక విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button