సినిమా

రేపే ప్రీమియర్స్.. ఎల్లుండి విడుదల.. 14 రీల్స్ ప్లస్ కీలక ప్రకటన!

క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్ :-ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నటువంటి బాలకృష్ణ అఖండ-2 సినిమాకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లేస్ చేసిన కొన్ని అనుకోని ఆర్ధిక పరిణామాల కారణంగా ఈ సినిమా వాయిదా వేయడం జరిగింది. అయితే తాజాగా మద్రాస్ కోర్టు ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే సినిమా విడుదల తేదీని ప్రకటించారు. రేపు రాత్రి నుంచి ప్రీమియర్ షోలు ఉంటాయని ఇక 12వ తేదీన సినిమా విడుదల చేయనున్నట్లుగా తాజాగా ఈ సినిమా నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ఇక ఈరోజు బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఇప్పటికే సినీ వర్గాలు ప్రకటించారు. ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాలు కారణంగానే వాయిదా పడిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తాజాగా ఆ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవడంతో ఈ మూవీ రిలీజ్ కు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయాయి. ఇక వారం రోజులు పాటుగా ఎదురుచూసిన బాలకృష్ణ అభిమానులకు ఈ విషయం కాస్త ఊరటనిచ్చింది. అయితే మరోవైపు ఎన్నో సినిమాలు ఈ సినిమా విడుదల కారణంగా వాయిదాలు వేసుకుంటున్నాయి. అసలు ఆ సినిమాలు ఎందుకు వాయిదా వేసుకుంటున్నాయి.. ఎందుకు అనేది తరువాతి న్యూస్ లో మీ ముందుకు వస్తాం.

Read also : జగన్ గెలిచినప్పుడు ప్రజలు గెలిపించారట.. మేం గెలిచినప్పుడేమో చోరీ అట : టీడీపీ ఎంపీ

Read also : రామ్మోహన్ కు ఆ శాఖ ఇచ్చింది డాన్సులు, రీల్స్ చేసుకోవడానికా?.. పేర్ని నాని ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button