తెలంగాణ

ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

క్రైమ్ మిర్రర్, యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు శివారులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ఇవాళ ఉదయం భారీ పేలుడు సంభవింవింది. ఈ ఘటటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జనగాం జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన మార్క కనకయ్య(54)గా గుర్తించారు. గాయపడిన ఏడుగుర్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్, యశోదా ఆసుపత్రులకు తరలించారు. కార్మికులు వెల్లడించిన వివరాల ప్రకారం..

Also Read : బాయ్స్ హాస్టల్‌లో దారుణ ఘటన.. ప్రియురాలి కోసం యువకుని దారుణహత్య!!

కంపెనీలో ఇవాళ ఉదయం 9:45 గంటల ప్రాంతంలో పీఆర్డీసీ బిల్డింగ్-3 లో పెల్లెట్ ఫార్ములా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా పేలుడు సంభవించిందని కంపెనీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ వెల్లడించారు. పేలుడు సమయంలో బిల్డింగ్‌లో మొత్తం 8 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో కనకయ్య మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం టిఫిన్ టైం కావటంతో కార్మికులంతా బయటకు రాగా‌.. 8 మంది మాత్రమే బిల్డింగ్‌లో ఉన్నారని దుర్గా ప్రసాద్ తెలిపారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌తో కార్మికులను అప్రమత్తం చేసింది. గ్యాస్ ఎనర్జీ కావడంతో బ్లాస్ట్ జరిగి ఉంటుందని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి : 

  1. అల్లు అర్జున్ కి గుడ్ న్యూస్!.. కానీ దేశం వదిలి వెళితే కఠిన చర్యలు?
  2. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు.. రైతు భరోసాకు కొత్త రూల్స్!
  3. 35 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్? కొత్త రూల్స్ ఇవే..
  4. వృద్ధులు, దివ్యాంగులకు గుడ్ న్యూస్.. నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం
  5. పేదలకు గుడ్ న్యూస్… ఒక్కొక్కరికి ఆరు కిలోలు సన్న బియ్యం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button