జాతీయం

కుంభమేళాలో మహా విషాదం..తొక్కిసలాటలో 17 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహా కుంభమేళాలో మహా విషాదం జరిగింది. త్రివేణి సంగమం ఘాట్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో 17 మంది భక్తులు మృతి చెందినట్టు తెలుస్తోంది. సుమారు 70 మంది వరకూ గాయపడ్డారని సమాచారం. వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

మౌని అమావాస్య కావడంతో త్రివేణి సంగమ ఘాట్‌లో స్నానాలకు భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రికే లక్షలాది మంది భక్తులు వచ్చారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో భక్తులను స్నానాలను అనుమతి ఇచ్చారు. కుంభమేళా నిర్వాహకులు మైక్ లో అనౌన్స్ చేయగానే భక్తులు ఒక్కసారిగా స్నానాలకు పరుగులు తీశారు, ఈ సందర్భంగా తొక్కిసలా జరిగినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రద్దీ నేపథ్యంలో గంగా నదిలో ఎక్కడ స్నానం చేసినా సమాన ఫలితం వస్తుందని, త్రివేణి సంగమ ఘాట్‌లోనే స్నానం చేయాల్సిన అవసరం లేదని అక్కడి సాధువులు చెబుతున్నారు.

తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలికి వచ్చి సహాయచర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. భక్తులకు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. గంగా ఘాట్ సమీపంలోని ఘాట్ వద్ద స్నానం చేయాలని.. త్రివేణి సంఘం వైపు వెళ్లడానికి ప్రయత్నించవద్దని సూచించారు.  అధికారుల సూచనలను అనుసరించాలని.. ఏర్పాట్లు చేయడంలో సహకరించాలని కోరారు. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దని సీఎం యోగీ విజ్ఞప్తి చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button