
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ప్రజల సమస్యలు స్వీకరించేందుకు ప్రారంభించిన గాంధీభవన్ ప్రజావాణి కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. మంత్రులు వారానికి ఇద్దరు వచ్చి వినతిపత్రాలు స్వీకరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆరు నెలలుగా ఒక్క మంత్రి కూడా రాలేదు అని ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓసారి కూడా ప్రజాదర్బార్ నిర్వహించలేదు. “ప్రజలే బాస్” అనే నినాదం ఇప్పుడో ఖాళీ నినాదంగానే మిగిలిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హడావుడి హామీలు… హజరు లేని మంత్రులు!
కాంగ్రెస్ ప్రజల మద్దతు సాధించిందా, మోసం చేసిందా అనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల హృదయాలను గెలుచుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రజావాణి–ప్రజాదర్బార్ కార్యక్రమాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల అర్జీలకు న్యాయం చేయాల్సిన నేతలే ఇప్పుడు అందుబాటులో లేరన్న వాస్తవం ప్రభుత్వం ప్రజలకు దూరమవుతుందన్న సంకేతాలను ఇస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.