
క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించినటువంటి “రాజా సాబ్” సినిమా ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ఓటిటిలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయినటువంటి జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రభాస్ ఈ సినిమా ద్వారా మళ్ళీ నాచురల్ హీరోగా కం బ్యాక్ ఇస్తారు అనుకుంటే చాలామంది ఈ సినిమా బాగాలేదు అంటూ కామెంట్లు చేశారు. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఈ సినిమా బాగాలేదని డైరెక్టుగా చెబుతూ మారుతిని దూషించారు. కానీ మరోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ప్రభాస్ నేచురల్ లుక్ చాలా రోజుల తర్వాత చూశాము అంటూ.. సినిమా చాలా బాగుంది అంటూ మిక్స్డ్ టాక్ వినిపించారు. ఏది ఏమైనా కూడా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో ప్రేక్షకులను అలరించింది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి జియో హాట్ స్టార్ లో తెలుగుతోపాటు మరో మూడు భాషల్లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ సినిమా ఈరోజు ఓటీటీలోకి వస్తుంది. జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా లో ముగ్గురు స్టార్ హీరోయిన్లు నటించారు. థియేటర్లలో చూడలేని ఈ సినిమాను ప్రభాస్ అభిమానులు ఈరోజు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. మరో వైపు శివ కార్తికేయన్ శ్రీ లీల కలిసిన నటించిన పరాశక్తి మూవీ ఫిబ్రవరి 7వ తేదీన జి ఫైవ్ లో విడుదల కాబోతుంది.
Also Read:
మున్సిపల్ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
ఉగాది పర్వదినం రోజున “గద్దర్ ఫిల్మ్ అవార్డులు”…!





