క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్ ప్రభాస్. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తనవంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోనూ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది.
ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం!..
ఈ ఏడాది కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. తాజాగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చూస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు డార్లింగ్. తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తనవంతు బాధ్యతగా ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు.
ప్రభాస్ ప్రచారం లో .. ఏమన్నారంటే ‘లైఫ్‌లో మనకు బోలెడన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు మన కోసం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్స్.. డ్రగ్స్ కు నో చెప్పండి. మీకు తెలిసినవాళ్లు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే ఈ రోజే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు ప్రభాస్. ఇలాంటి సందేశాలు ఇచ్చినటువంటి ప్రభాస్ పై చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఇలాంటి సందేశాలు ఇస్తే ఇండియా డ్రగ్స్ బారిన పడకుండా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.