Homeఆంధ్ర ప్రదేశ్Poola Bala: ఫారిన్ లాంగ్వేజెస్ లో ఉచిత సేవలందిస్తూ.. వైరల్ గా మారిన వెంకట్ పూలబాల!   

Poola Bala: ఫారిన్ లాంగ్వేజెస్ లో ఉచిత సేవలందిస్తూ.. వైరల్ గా మారిన వెంకట్ పూలబాల!   

  • ఫారిన్ లాంగ్వేజెస్ లో ఉచిత శిక్షణ
  • ఈజీ ఫారిన్ లాంగ్ వేజెస్ అనే సంస్థను స్థాపించి పూలబాల
  • స్కూళ్లకు వెళ్లి ఫ్రీగా బోధన చేస్తున్న బహుభాషావేత్త

అతడి పేరు వెంకట్  ప్రసాద్. అతడు  పోలీగ్లాట్ అంటే  బహుభాషి. ఫ్రెంచ్ , జర్మన్, స్పానిష్ ఇటాలియన్, ఇంగ్లీష్, జపనీస్ – ఆరు భాషలు అనర్గళం గా మాట్లాడతాడు. ఆరు భాషలలో 60 పుస్తకాలు రాసాడు రెండు ప్రపంచ రికార్డులు పొందాడు.    పూలబాల(  కలంపేరు) గా మారి  బాల బాలికలకోసం ఇంగ్లీష్ తెలుగుల్లో  అనేక చిన్న పిల్లల  కథల పుస్తకాలు  రాసాడు.  ఈ బహుభాషి (పోలిగ్లోట్) అనేక దేశ విదేశీ సంస్థలకు అనువాదకుడిగా సేవలందించాడు.

ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే…

భాషా శైనికుడిగా మారి  బాల బాలికులకు పూలబాట వేస్తున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాతాలలో విద్యార్ధులకు  భాషా ప్రాధాన్యతను తెలియచేస్తూ భాషా  నైపుణ్యాల పై ఉచితంగా శిక్షణ నిస్తున్న భాషా సైనికుడు ఈ బాహుబాషి పూలబాల.

ఈజీ ఫారిన్ లాంగ్ వేజెస్ సంస్థ స్థాపన

విజయవాడలో  ఈజీ ఫారిన్ లాంగ్ వేజెస్ అనే సంస్థను స్థాపించి వేలాది మందికి  ఫ్రెంచ్, జర్మన్,  స్పానిష్, ఇటాలియన్, జపనీస్,ఇంగ్లీష్ లాంటి ఆరు విదేశీ  భాషల్లో  శిక్షణ ఇస్తున్నారు పూలబాల.  నిత్యజీవితంలో ఈ భాషలను మాట్లాడుతూ రేడియో దూరదర్శన్ లో విదేశీభాషల పై కార్యక్రమాలు ఇవ్వటమే కాకుండా, వాటిని  ఉచితంగా స్కూల్ పిల్లలకు  బోధిస్తూ, నేర్చుకోడంలో మెళుకువలు తెలియజేస్తూ  వైరల్ అవుతున్నాడు వెంకట్ పూలబాల.

సొంతలాభం కొంత మానుకొని..

మూడు రోజులు ఆరు భాషల గ్రామర్ క్షుణ్ణంగా అర్థం అయ్యేలా శిక్షణ  ఇవ్వబడుతుంది రాక పొతే  పూర్తి బాధ్యత నాదే అని తెలియజేస్తూ  ఏ స్కూల్ అయినా  ఉచిత శిక్షణ  కొరకు సంప్రదించ వచ్చని తన నెంబర్ 9700877409 ఇచ్చాడు. తెలంగాణ  ఆంధ్ర అనేక మారుమూల ప్రాంతాలలో స్కూల్స్ కి వెళ్లి అక్కడ 3 రోజులు బస చేసి విజయవంతంగా శిక్షణ ఇస్తున్నాడు. ఐతే ఇలా దూరప్రాంతాలకు వెళ్లి శిక్షణ ఇచ్చేటప్పుడు తన సంస్థను మూసేయాల్సి ఉంటుంది. అందువల్ల తను కొన్ని ఎడ్మిషన్లు కోల్పోవలసి వస్తుందని చెప్పారు పూలబాల. ఈ సమాజ సేవకు గాను ఈయనకి ఏదైనా గుర్తింపు రావాలని కోరుకుందాం!

Read Also:వందేమాతరం కొత్త ప్రోటోకాల్.. ఎప్పుడు ఆలపించాలంటే?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments